Tuesday, April 18, 2017

పది రూపాయలకే వైద్యం -అనపర్తి డాక్టర్


అనపర్తిలో పెద్ద డాక్టర్ గా మరియు YSRCP కో-ఆర్డినేటర్ గా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. ఈయన పొలమూరు గ్రామములో 1961వ సంవత్సరం అక్టోబర్ 31న జన్మించారు. తండ్రి సత్తి గంగిరెడ్డి గారు, తల్లి సీతయ్యమ్మ గారు. ఈయనకు ఒక సోదరుడు. పేరు గోపాలకృష్ణారెడ్డి. ఈయన 1 నుండి 5వ తరగతి వరుకు పొలమూరు MPUP స్కూల్ లో చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్ మీడియట్ విజయవాడలో చదివారు. ఆపై చదువులు MBBS కూడా విజయవాడ సిద్దార్ద మెడికల్ కాలేజిలో చదివారు. ఆ తరువాత MS చేయడానికి కర్ణాటక రాష్ట్రం లో దావనగిరిలో JJM మెడికల్ కాలేజిలో పూర్తిచేసారు. చిన్నప్పటి నుండి తన మేనమామ అయిన కంటి డాక్టర్ T. సత్యనారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నానని, ఆయనలా నేను కూడా డాక్టర్ కావాలనుకున్నానని, ఎంతో మందికి వైద్య చికిత్సలు చేయాలని అనుకునేవారు. ఈయన ఎప్పుడూ ఒక మెరిట్ స్టూడెంట్ గానే కొనసాగేవారు. అందరూ ఈయన్ని ముద్దుగా సూరిబాబు అని పిలుస్తారు. ఇంట్లో ఎప్పుడూ కూడా తగిన ప్రోత్సాహం ఉండేది. 1983 వ సంవత్సరం, మే 31 న ఆదిలక్ష్మి గారితో ఆయన వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. పేరు గౌతమ్ రెడ్డి. ఆయన కూడా డాక్టర్. సూర్యనారాయణ రెడ్డి గారు ఖాళీ సమయాలలో మేగ్ జైన్ లు చదువుతూ ఉంటారు. తన వృత్తే తన హాబీ అని అంటున్నారు. ఈయన Non - veg ఇష్టంగా తింటారు. ఇష్టమైన కలర్ రెడ్. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. 1991వ సంవత్సరం, నవంబర్ 21న అనపర్తి లో వారి తండ్రి పేరు మీద గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని ఆయన తెలిపారు. అయితే తనను డాక్టర్ గా చూడాలనుకున్న వారి నాన్నగారి కోరిక, ఈయన డాక్టర్ అయిన 3 నెలలోనే ఆయన కాలం చేయడం తన జీవితంలో అత్యంత భాదాకర సంఘటన అని తెలిపారు. కుటుంభ ఐక్యత - బందు వర్గం తనకు బలమైతే, మొహమాటం ఈయన ప్రధాన బలహీనత. ఈయనకు ఇష్టమైన ఆట కబడ్డీ. జీవితంలో ఒకరే ఇష్టమైన స్నేహితుడని కాకుండా అందరిని స్నేహితులగానే భావిస్తానని ఆయన తెలియజేసారు. అనపర్తి చుట్టు ప్రక్కల గ్రామాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకనే ఇక్కడ హాస్పటల్ ప్రారంభించానని, ఈ రోజుకి కూడా జిల్లాలో ఒక సింగిల్ డాక్టర్ ఇంత మంది పేషెంట్లకు సర్జరీ చేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ఈ రోజుకి కూడా ఎక్కడా లేని విధంగా 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. లేనివారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అనపర్తిని రాజకీయాలలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది ఆయనకు ఉన్న ఒక డ్రీమ్ వర్క్. 2014 లో YSRCP పార్టీ తరుపున MLA గా పోటి చేసి స్వల్ప మెజారిటి తో ఓటమి చెందారు. అందుకు ఏ రోజు తాను బాదపడలేదని, తనకు ఆ ఓటమి ఒక గుణపాఠమని ఆయన తెలిపారు. అనపర్తి లో ఉన్న ప్రతీ సమస్యపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. కొంత కాలముగా అనపర్తిని పట్టి పీడిస్తున్న కెనాల్ రోడ్ సమస్యకి ప్రజలు, స్వచ్చంద సంస్థలు సహకారంతో  వేల మందితో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజుకి గడపగడపకు YCP పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని మహిళలతో కలిసి దర్నా నిర్వహించారు. ఇంకా రాబోయే రోజులలో మరిన్ని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 2019 లో YSRCP తరుపున MLA గా పోటిచేసి గెలిచి ప్రజలందరిని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తానని ఆయన తెలిపారు.    

               భవిష్యత్ లో ఈయన మరిన్ని గొప్ప విజయాలు సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ - మన అనపర్తి....

Saturday, February 4, 2017

పురాతన ఆలయాల నిలయ౦ గొల్లలమామిడాడ అధ్బుతమైన చిత్రాలు మీరు చూడ౦డి.తప్పకు౦డా షేర్ చేయ౦డి..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజవర్గ౦ లో ని పెదపూడి మ౦డల౦లోని గొల్లలమామిడాడ
సూర్యానారాయణ స్వామి వారి దేవాలయ౦
 మరియు రదోత్సవ౦. అధ్బుతమైన చిత్రాలు ఇవిగో.......