Saturday, November 12, 2016

రూ.2వేల నోటు నకిలీ వచ్చింది : బీ అలర్ట్


జస్ట్ 48 గంటలు మాత్రమే అయ్యింది. రూ.2వేల నోటు మార్కెట్ లోకి వచ్చిందో లేదో అప్పడు నకిలీలు తయారయ్యాయి. జిరాక్స్ కాపీలు తీసి.. రద్దీ ఏరియాల్లో చెలామణి చేస్తున్నారు కేటుగాళ్లు. రూ.2వేల నోటు టీవీలు, పపేర్లలో చూడటమేగానీ.. కోట్లాది మందికి అది చేరువ కాలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బురిడీ కొట్టిస్తున్నారు దొంగలు. కర్నాటకలోని చిక్ మంగళూరులో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ అలర్ట్ చేసింది. చిక్ మంగళూరులోని APMC మార్కెట్ ఉంది. అశోక్ అనే రైతు మార్కెట్ కు ఉల్లిపాయ సంచులు తీసుకొచ్చాడు. అతని దగ్గర ఉల్లి సంచులు కొనుగోలు చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. రూ.2వేల కొత్త నోటు ఇచ్చాడు. బ్యాంకులో ఇచ్చారని.. చెల్లుతుందని గట్టిగా చెప్పాడు. అప్పటికే పేపర్లు, టీవీల్లో చూసిన రైతు అశోక్.. నోటు తీసుకున్నారు. కొత్త నోటును స్నేహితులకు చూపించాడు. వాళ్లు దాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఇది కలర్ జిరాక్స్ తీసిన నోటులా ఉంది.. నాణ్యతలో కూడా తేడా ఉంది అని గుర్తించారు. దీనిపై చిక్ మంగళూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు రైతు. అలర్ట్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నామలై వెంటనే రంగంలోకి దిగారు. రైతుతోపాటు APMC మార్కెట్ కు వచ్చి విచారణ చేశారు. రైతుకు ఇచ్చిన నోటు కలర్ జిరాక్స్ కాపీ అని.. కొత్త రూ.2వేల నోటుతో జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులు, రైతులను అలర్ట్ చేశారు పోలీసులు. దీనిపై 420 కింద కేసు నమోదు చేశారు.

Friday, November 11, 2016

ఇప్పుడు పాత నోట్లివ్వండి.. వారం తర్వాత కొత్త నోట్లిస్తాం



 రద్దయిన రూ.500, 1000 నోట్లను మార్చే కమీషన్‌ ఏజెంట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా హల్‌చల్‌ చేస్తున్నారు. ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల జమ పరిమితి విధించడంతో బడాబాబులు ఇలాంటివారిని ఆశ్రయిస్తున్నారు. వారి డబ్బు మార్చి పెడతామని.. అందుకు తమకు 15 నుంచి 25 శాతం దాకా కమీషన్‌ ఇవ్వాలని దళారులు వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా దందా బాగా జరుగుతోంది. అయితే, పాత నోట్లు ఇప్పుడు తీసుకుని వారం తర్వాత కొత్త నోట్లు ఇస్తామంటుండడంతో కొందరు వెనకాడుతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ఓకే అంటున్నారు.

Wednesday, November 9, 2016

నోట్ల రద్దు పై అనపర్తి నాయకులు ఏమన్నార౦టే???

ప్రధాని మోడి అవినీతిని అ౦త౦ చేయడనికి నోట్ల రద్దు పై 
 మన అనపర్తి ఎమ్మల్యే . నల్లమిల్లి .రామక్రిష్ణారెడ్డి గారు మరియు వై.ఎస్.ఆర్.సి.పి.కో-ఆర్డినేటర్ డాక్టర్.సత్తి.సూర్యనారాయణరెడ్డి గారు స్ప౦దన...

వడ్డీ లేకుండా రుణాలంటూ కొందరి ఆఫర్‌...



గుంటూరు (నల్లచెరువు) : పెద్ద నోట్లు రద్దు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి నుండి జనంలో బ్లాక్‌ మనీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మోదీ సాహోసపేత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్లాక్‌ మనీ బడాబాబులు దాన్ని వైట్‌ చేసుకునేందుకు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన వారికి ఏడాది పాటు వడ్డీ లేకుండా రుణం ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఏడాది తరువాత అసలు ఇస్తే చాలని అంటున్నారు. ఇలా రూ. లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా రూ. 50 లక్షలు అయినా ఇస్తామంటున్నారు. ఇలాంటి వారు గుంటూరులో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

శని, ఆదివారాలు బ్యాంకులు ఓపెన్


రాబోయే శని, ఆదివారాలు ( 12, 13తేదీలు ) అన్ని బ్యాంకులు పని చేస్తాయని ప్రకటించింది RBI. రూ.500, రూ.1000 నోట్లు రద్దు క్రమంలో కొత్త నోట్లు మార్చుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయటానికి వీలుగా ఈ రెండు రోజులు పని చేస్తాయని ప్రకటించింది. ఎంత అయినా డిపాజిట్ చేయొచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది RBI. పాత నోట్లు డిపాజిట్ చేసి.. కొత్త నిబంధనల ప్రకారం కొత్త నోట్లు విత్ డ్రాయర్ చేసుకోవచ్చని ప్రకటించింది.

Tuesday, November 8, 2016

BLACK MONEY పై మోడి ఉక్కు పాద౦ -స౦చలన నిర్ణయ౦..

*💸500; 1000 నోట్లు ముద్రణ రద్దు నరేంద్ర మోడీ*
*👉🏼ఈరోజు అర్ద రాత్రి నుండి 500 1000 నోట్లు ను రిజర్వ్ బ్యకు ముద్రణ ని రద్దు చేస్తుంది.*
మీ దగ్గర ఉన్బ 500,1000 నోట్లులను డిసెంబరు 30 లోగా బ్యాంకులో మార్చుకోవాలి.....
ప్రతిరోజూ ఎ టి యమ్ నుండి 10000 వారానికి 20000మించి డ్రా చేయ్యకూడదు.......కేంద్ర ప్రభుత్వం అదేశాలు ప్రకారం ...
*మోఢీ ధమాకా నల్లధనం నియంత్రణకు చర్యలు*
*RS 500/ RS 1000/ ముద్రణఋ రద్దు*
*9-11-2016,10-11-2016 ATM లు బంద్*
*వారానికి 20,000/ మించి WITHDRAW చేయరాదు.*
*ముద్రణ నేటి రాత్రి నుండే రద్దు.*
*11-11-2016 వరకు చలామణిలో ఉంటాయి.*
*31-12-2016 లోపు ఐడి చూపించి BANK,POST OFFICE లలో జమ చేయాలి*

    

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవాలంటే ఇవి ఉండాల్సిందే..

 నల్లధనాన్ని అరికట్టడానికి రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చలామణిలో ఉండవని ప్రధాని మంత్రి మోదీ ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను మార్చుకోవడం అంత తేలిక కాదు

Monday, November 7, 2016

ఈ నెల 14న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది.



ఈ నెల 14న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది.
 ఆరోజున గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమి వైపునకు చంద్రుడు రానున్నాడు. 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది చందమామ. సాయంత్రం 5.45 గంటల నుంచి రెండు గంటల పాటు ఈ అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతమవుతుంది.
అదేరోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తప్పితే మళ్లీ 2034 వరకు చంద్రుడిని ఇలా చూసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Sunday, November 6, 2016

టాలీవుడ్ హీరోలు 'రెడ్డి' అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా ??

రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి.. అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది. మన హీరోలంతా రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోలే కాదు ఇలా ఇంకా చాలామంది టాలీవుడ్ హీరోలు రెడ్డి సమాజిక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. అసలు ఈ రెడ్డి సెంటిమెంట్ ఏంటి?




Friday, November 4, 2016

అనపర్తి నియోజక వర్గ౦లో పేరుకుపోయిన విధ్యుత్తు భకాయిలు....

అనపర్తి మ౦డల౦లో  11 ప౦చాయితీలు విధ్యుత్తు ప౦పిణి స౦స్తకు RS.2.69 కోట్లు చెల్లి౦చాలి......
అ౦దులో ...............
అనపర్తి ప౦చాయితీ--------                             RS.1.55 కోట్లు....
లక్ష్మీనర్సాపుర౦ ప౦చాయితి----                      RS.10.57 కోట్లు....
రామవర౦  ప౦చాయితి ------                           RS.8.04 లక్షలు....
బిక్కవోలు మ౦డల౦లో  13  ప౦చాయితీలకు    RS.2.02 కోట్లు....
ర౦గ౦పేట మ౦డల౦లో  16 ప౦చాయితీలకు     RS.3.10 కోట్లు...
పెదపూడి మ౦డల౦లో  18 ప౦చాయితీలకు      RS.2.18 కోట్లు...
-------------------------------

  మన అనపర్తి.