Saturday, November 12, 2016

రూ.2వేల నోటు నకిలీ వచ్చింది : బీ అలర్ట్


జస్ట్ 48 గంటలు మాత్రమే అయ్యింది. రూ.2వేల నోటు మార్కెట్ లోకి వచ్చిందో లేదో అప్పడు నకిలీలు తయారయ్యాయి. జిరాక్స్ కాపీలు తీసి.. రద్దీ ఏరియాల్లో చెలామణి చేస్తున్నారు కేటుగాళ్లు. రూ.2వేల నోటు టీవీలు, పపేర్లలో చూడటమేగానీ.. కోట్లాది మందికి అది చేరువ కాలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బురిడీ కొట్టిస్తున్నారు దొంగలు. కర్నాటకలోని చిక్ మంగళూరులో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ అలర్ట్ చేసింది. చిక్ మంగళూరులోని APMC మార్కెట్ ఉంది. అశోక్ అనే రైతు మార్కెట్ కు ఉల్లిపాయ సంచులు తీసుకొచ్చాడు. అతని దగ్గర ఉల్లి సంచులు కొనుగోలు చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. రూ.2వేల కొత్త నోటు ఇచ్చాడు. బ్యాంకులో ఇచ్చారని.. చెల్లుతుందని గట్టిగా చెప్పాడు. అప్పటికే పేపర్లు, టీవీల్లో చూసిన రైతు అశోక్.. నోటు తీసుకున్నారు. కొత్త నోటును స్నేహితులకు చూపించాడు. వాళ్లు దాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఇది కలర్ జిరాక్స్ తీసిన నోటులా ఉంది.. నాణ్యతలో కూడా తేడా ఉంది అని గుర్తించారు. దీనిపై చిక్ మంగళూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు రైతు. అలర్ట్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నామలై వెంటనే రంగంలోకి దిగారు. రైతుతోపాటు APMC మార్కెట్ కు వచ్చి విచారణ చేశారు. రైతుకు ఇచ్చిన నోటు కలర్ జిరాక్స్ కాపీ అని.. కొత్త రూ.2వేల నోటుతో జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులు, రైతులను అలర్ట్ చేశారు పోలీసులు. దీనిపై 420 కింద కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment