Friday, November 11, 2016

ఇప్పుడు పాత నోట్లివ్వండి.. వారం తర్వాత కొత్త నోట్లిస్తాం



 రద్దయిన రూ.500, 1000 నోట్లను మార్చే కమీషన్‌ ఏజెంట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా హల్‌చల్‌ చేస్తున్నారు. ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల జమ పరిమితి విధించడంతో బడాబాబులు ఇలాంటివారిని ఆశ్రయిస్తున్నారు. వారి డబ్బు మార్చి పెడతామని.. అందుకు తమకు 15 నుంచి 25 శాతం దాకా కమీషన్‌ ఇవ్వాలని దళారులు వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా దందా బాగా జరుగుతోంది. అయితే, పాత నోట్లు ఇప్పుడు తీసుకుని వారం తర్వాత కొత్త నోట్లు ఇస్తామంటుండడంతో కొందరు వెనకాడుతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ఓకే అంటున్నారు.

No comments:

Post a Comment