Saturday, February 4, 2017
Tuesday, December 27, 2016
Saturday, November 12, 2016
రూ.2వేల నోటు నకిలీ వచ్చింది : బీ అలర్ట్
జస్ట్ 48 గంటలు మాత్రమే అయ్యింది. రూ.2వేల నోటు మార్కెట్ లోకి వచ్చిందో లేదో అప్పడు నకిలీలు తయారయ్యాయి. జిరాక్స్ కాపీలు తీసి.. రద్దీ ఏరియాల్లో చెలామణి చేస్తున్నారు కేటుగాళ్లు. రూ.2వేల నోటు టీవీలు, పపేర్లలో చూడటమేగానీ.. కోట్లాది మందికి అది చేరువ కాలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బురిడీ కొట్టిస్తున్నారు దొంగలు. కర్నాటకలోని చిక్ మంగళూరులో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ అలర్ట్ చేసింది. చిక్ మంగళూరులోని APMC మార్కెట్ ఉంది. అశోక్ అనే రైతు మార్కెట్ కు ఉల్లిపాయ సంచులు తీసుకొచ్చాడు. అతని దగ్గర ఉల్లి సంచులు కొనుగోలు చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. రూ.2వేల కొత్త నోటు ఇచ్చాడు. బ్యాంకులో ఇచ్చారని.. చెల్లుతుందని గట్టిగా చెప్పాడు. అప్పటికే పేపర్లు, టీవీల్లో చూసిన రైతు అశోక్.. నోటు తీసుకున్నారు. కొత్త నోటును స్నేహితులకు చూపించాడు. వాళ్లు దాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఇది కలర్ జిరాక్స్ తీసిన నోటులా ఉంది.. నాణ్యతలో కూడా తేడా ఉంది అని గుర్తించారు. దీనిపై చిక్ మంగళూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు రైతు. అలర్ట్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నామలై వెంటనే రంగంలోకి దిగారు. రైతుతోపాటు APMC మార్కెట్ కు వచ్చి విచారణ చేశారు. రైతుకు ఇచ్చిన నోటు కలర్ జిరాక్స్ కాపీ అని.. కొత్త రూ.2వేల నోటుతో జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులు, రైతులను అలర్ట్ చేశారు పోలీసులు. దీనిపై 420 కింద కేసు నమోదు చేశారు.
Friday, November 11, 2016
ఇప్పుడు పాత నోట్లివ్వండి.. వారం తర్వాత కొత్త నోట్లిస్తాం
రద్దయిన రూ.500, 1000 నోట్లను మార్చే కమీషన్ ఏజెంట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా హల్‌చల్ చేస్తున్నారు. ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల జమ పరిమితి విధించడంతో బడాబాబులు ఇలాంటివారిని ఆశ్రయిస్తున్నారు. వారి డబ్బు మార్చి పెడతామని.. అందుకు తమకు 15 నుంచి 25 శాతం దాకా కమీషన్ ఇవ్వాలని దళారులు వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా దందా బాగా జరుగుతోంది. అయితే, పాత నోట్లు ఇప్పుడు తీసుకుని వారం తర్వాత కొత్త నోట్లు ఇస్తామంటుండడంతో కొందరు వెనకాడుతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ఓకే అంటున్నారు.
Wednesday, November 9, 2016
వడ్డీ లేకుండా రుణాలంటూ కొందరి ఆఫర్...
గుంటూరు (నల్లచెరువు) : పెద్ద నోట్లు రద్దు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి నుండి జనంలో బ్లాక్ మనీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మోదీ సాహోసపేత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్లాక్ మనీ బడాబాబులు దాన్ని వైట్ చేసుకునేందుకు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన వారికి ఏడాది పాటు వడ్డీ లేకుండా రుణం ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఏడాది తరువాత అసలు ఇస్తే చాలని అంటున్నారు. ఇలా రూ. లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా రూ. 50 లక్షలు అయినా ఇస్తామంటున్నారు. ఇలాంటి వారు గుంటూరులో పెద్ద సంఖ్యలో ఉన్నారు.
శని, ఆదివారాలు బ్యాంకులు ఓపెన్
రాబోయే శని, ఆదివారాలు ( 12, 13తేదీలు ) అన్ని బ్యాంకులు పని చేస్తాయని ప్రకటించింది RBI. రూ.500, రూ.1000 నోట్లు రద్దు క్రమంలో కొత్త నోట్లు మార్చుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయటానికి వీలుగా ఈ రెండు రోజులు పని చేస్తాయని ప్రకటించింది. ఎంత అయినా డిపాజిట్ చేయొచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది RBI. పాత నోట్లు డిపాజిట్ చేసి.. కొత్త నిబంధనల ప్రకారం కొత్త నోట్లు విత్ డ్రాయర్ చేసుకోవచ్చని ప్రకటించింది.
Subscribe to:
Posts (Atom)



















